Valuable Information
Srikrutham.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్ . మన హిందు ధర్మం - మన సంస్కృతి -- మీ శ్రీకాంత్ శర్మ
Ph No: +91-8712940140
msksharma108@gmail.com

Daily Free Horoscope And Astrology At Srikrutham
శ్రీకృతం కి స్వాగతం

ఈరోజు పంచాంగం

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖి నామ సం. దక్షిణాయణం గ్రీష్మఋతువు , ఆషాడమాసం కృష్ణ పక్షము.
తేది : జూలై 28, 2016, గురువారము.
తిథి : బ. నవమి. మ.1.04 వరకు
నక్షత్రం : భరణి ఉ.9.05 వరకు
వర్జ్యం : రా.8.17 - 9.50
దుర్ముహూర్తం : ఉ.9.55 - 10.50 & మ.3.00 -4 .00
రాహుకాలం : మ.1.30 - 3.00
శుభసమయం : సా.4.02 - 5.55

ఈ రోజు సిజేరియన్ మరియు సాధారణ శుభకార్యాలకు మంచి రోజు కాదు . నక్షత్ర శాంతి తప్పనిసరి.

అధిక వివరాలకు 9849485645 కి కాల్ చేసి సందేహ నివృత్తి చేసుకోగలరు.
www.facebook.com/hindhudarmachkram

....మీ హిందూ ధర్మచక్రం.ఈరోజు వ్యాసం

ఏకాదశి అంటే 11.  తెలుగు తిథుల్లో 11 వ తిథిని ఏకాదశి అంటారు.
 ఏకాదశి  Ekadashi  ఉపవాసం  అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆరోగ్యపరంగా చాలా మంచిరోజు. ఈ రోజు భోజనం మానేసి పాలు పండ్లు వంటి పదార్థాలతో గడిపితే శరీరం పూర్ణ ఆరోగ్యంతో  ఉంటుంది. అయితే  ఒక్కో నెలకి  రెండు ఏకాదశులు వస్తాయి . మరి ఆ ఏకాదశుల పేర్లు వివరాలు తెలుసుకుందామా ?
1) చైత్ర శుద్ధ ఏకాదశి  :-
ఈ ఏకాదశి ని “ కామద ఏకాదశి “ అని అంటారు . ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన సమస్త కోరికలు తీరుతాయి .
2 ) చైత్ర బహుళ ఏకాదశి :-
ఈ ఏకాదశని “ వరూధిని  ఏకాదశి “ అని అంటారు . ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించిన వేయి గోవుల దాన మిచ్చినంత పుణ్యము కలుగుతుంది .
3 ) వైశాఖ శుద్ధ  ఏకాదశి :-
ఈ ఏకాదశిని “ మోహిని  ఏకాదశి  “ అంటారు . దీనిని ఆచరించిన కోరిన వ్యక్తులు వశమవుతారు  అంటారు . ఆకర్షణ శక్తి పెరుగును . ఈ రోజునే అన్నవరం లో శ్రీ సత్యనారాయణ స్వామి కళ్యాణం జరుగును .
4) వైశాఖ బహుళ ఏకాదశి :-
ఈ ఏకాదశిని  అపర ఏకాదశి అంటారు . ఏకాదశి వ్రతముని ఆచరించుటవలన సమస్త తీర్ద క్షేత్రముల  దర్శన ఫలం లభిస్తుంది .
5 ) జ్యేష్ట శుద్ధ ఏకాదశి :-
ఈ ఏకాదాశిని “ నిర్జలైకాదశి “ అని అంటారు . ఈ రోజున కనీసం మంచి నీరు కూడా త్రాగకుండా వ్రతం ఆచరించి  విష్ణు సహస్ర నామం పారాయణం చేసిన సకల శుభములు కలుగును . ఆచమన సమయంలో తీసుకునే జలానికి దోషం ఉండదు. ఈ ఒక్క ఏకాదశి  ఉపవాసం చేసినా  మిగతా అన్ని ఏకాదశులు చేసిన  ఫలం లభిస్తుంది.
6 ) జ్యేష్ట బహుళ ఏకాదశి :-
ఈ ఏకాదశిని  యోగిని ఏకాదశి  అంటారు . ఈ వ్రతము ఆచరించిన ఎడల సమస్త రోగములు నయమగును . దీర్ఘ రోగములు పటాపంచలగును .
7 ) ఆషాఢ శుద్ధ ఏకాదశి :-
దీనినే తొలి ఏకాదశి  లేదా  , శయన ఏ కాదశి అని అందురు . ఈ రోజునే “ చాతుర్మస్య “ వ్రతారంభం చేస్తారు . శ్రీ మహా విష్ణువు ఈ రోజున క్షీరసాగరం నందు నిద్రిస్తాడు . ఈ వ్రతమును 18 సంవత్సరముల వయస్సు నుండి జీవితాంతం ఆచరించినా దీర్ఘాయువు కలిగి నిండు నూరేళ్ళు జీవిస్తారు .
8 ) ఆషాడ శుద్ధ ఏకాదశి :-
దీనినే “ కామ్య ఏకాదశీ “ అందురు . దీనిని ఆచరించుట వలన సమస్త కొరీకలు తీరును .
9 ) శ్రావణ శుద్ధ ఏకాదశి :-
ఈ ఏకాదశిని “ పుత్ర ఏకాదశి “ అంటారు . దీనిని ఆచరించిన ఎడల సంతానం కలుగును . పుత్ర సంతానం లేని వారికి తప్ప పుత్రసంతానం కలుగునని ఉవాచ.
10 ) శ్రావణ బహుళ ఏకాదశి :-
ఈ ఏకాదశిని “ అజైకాదశి “ అని అందురు . దీని ఆచరించిన వారు సమస్త కష్టములు తొలగి అజేయులగుదురు .
11 ) భాద్రపద శుద్ధ  ఏకాదశి :-
దీనిని “ పరివర్తన ఏకాదశి  “ అంటారు . శయనేకాదశినాడు నిదురించిన మహావిష్ణువు ఎడమ ప్రక్క నుండి కుడి ప్రక్కకు తిరుగును అంధుచే దీనిని పరివర్తన్యైకాదశి అని పేరు .. ఈ వ్రతం చేస్తే నిలిచిపోయిన పనులు పూర్తి అగును .
12 ) భాద్రపద బహుళ ఏకాదశి :-
దీనిని  ఇందిరా  ఏకాదశి అందురు . ఈ ఏకాదశి వ్రతం చేసినవారు ఇంద్రుని తో సమానమైన భోగములు అనుభవించును .
balaji-god-wallpaper-167_20110129_1425738466
13 ) ఆశ్వీయుజ  శుద్ధ  ఏకాదశి :-
దీనిని  పాపాంకుశ ఏకాదశి  అంటారు . విజయదశమి అయిన వెంటనే వచ్చు ఏకాదశి ఇది . ఈ వ్రతం ఆచరించటం వలన అన్నీ రంగములందు విజయం లభించును .
14 ) ఆస్వాయుజ బహుళ ఏకాదశి :-  దీనిని “ రమ ఏకాదశి “ అంధురు . ఈ వ్రతం ఆచరించిన వారు ఉత్తమ స్థాన ప్రాప్తి పొందగలరు .
15 ) కార్తీక శుద్ధ  ఏకాదశి :-
దీనిని “ ఉత్థాన ఏకాదశి  లేదా  భోధన ఏకాదశి “ అని కూడా అంటారు . ఈ రోజు విష్ణువు నిదురలేచును .. ఈ వ్రతం ని ఆచరించిన వారు అనేక దాన ధర్మములు చేయుట వలన లభించే ఫలం లభించును .
16 ) కార్తీక బహుళ ఏకాదశి :-
దీనిని “ ఉత్పత్తి ఏకాదశి  “ అంటారు . ఈ రోజున శ్రీ మహా విష్ణువు ఏకాదశి దేవతని సృష్టించినాడు .. ఈ వ్రతం ఆచరించుట వలన సమస్త దోషాలు నశించును .
17 ) మార్గశిర శుద్ధ  ఏకాదశి :-
దీనిని  మోక్షదా ఏకాదశి   అంటారు . భవధ్గీత జన్మి౦చిన రోజుగా గీతా జయంతి కూడా ఈ రోజునే చేస్తారు . ఈ వ్రతం చేయటం వల్ల స్థిరమైన మనస్సుతో పాటు , ముక్తిని కూడా పొందుతారు .
18 ) మార్గశిర బహుళ ఏకాదశి :-
దీనిని “ సఫల ఏకాదశి “ అంటారు . ఈ వ్రతం ఆచరించుట వల్ల అనేక ఉపకారములు జరిగి జీవితం లో అనేక మంచి కార్యములు చేయూదురు .
19 ) పుష్య శుద్ధ ఏకాదశి :-
దీనిని “ వైకుంఠ ఏకాదశి  లేదా  మోక్ష ఏకాదశి “ అంటారు . ఈ వ్రతం ఆచరించే వారు “ విష్ణు లోకమును పొందే మోక్షం ప్రాప్తిస్తుంది .
20 ) పుష్య బహుళ ఏకాదశి :-
దీనిని “ తిలైకాదశి “ అంటారు . ఈ రోజున నువ్వు గింజలతో స్నానం , నువ్వుల పొడి తో చేసిన వంటకం , , నువ్వు గింజలతో చేసిన చిమ్ని ఆహారం తీసుకొని నువ్వులు దానం చేయాలి . అట్లా చేస్తే శని దోషాలు పోతాయి .
21 ) మాఘ శుద్ధ ఏకాదశి :-
దీనిని “ భీష్మ ఏకాదశి “ అంటారు . ఈ రోజునే భీష్ముడు వైకుంఠం చేరిన రోజు . ఈ రోజు న విష్ణు సహస్ర నామ పారాయణం అత్యంత పుణ్య ప్రదం.
22) మాఘ బహుళ ఏకాదశి :-
దీనిని “ విజయై కాదశి “ అంటారు . ఈ వ్రతం ఆచరించుట వలన విష్ణు సాయుజ్యం పోదుంతారు .
23) ఫాల్గుణ శుద్ధ  ఏకాదశి :-
దీనిని “ ఆమల ఏకాదశి “ అంటారు . ఈ వ్రతం చేయడం వల్ల భార్య భర్తలు అన్యోన్యం గా జీవిస్తారు .
24) ఫాల్గుణ బహుళ ఏకాదశి :-
దీనిని “ పాప విమోచనైకాదశి “ అంటారు . ఈ వ్రతం ఆచరించుట వల్ల ఒక సంవత్సరములో చేసిన పాపములు అన్నీ మాయమైపోతాయి .......మీ హిందూ ధర్మచక్రం.
Read More
ఈరోజు శుభాషితం
ఎంతటి శత్రువునైన ప్రేమతో చూడాలి -- వివేకానంద
OUR PARTNERS
Srikrutham.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్ . 
CATERING SERVICES
Srikrutham.com తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్ .  • How to Celebrate Vinaya Chavithi in Telugu By Srikanth Sharma
    • How to Celebrate Vinaya Chavithi in Telugu By Srikanth Sharma

    • Watch Video

  • Auspicious Things To Do at Godavari Pushkaralu By Srikanth Sharma
    • Auspicious Things To Do at Godavari Pushkaralu By Srikanth Sharma

    • Watch Video


మన పండుగలు
« PrevJuly 2016Next »
MondayTuesdayWednesdayThursdayFridaySaturdaySunday
    
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31శ్రీకృతం గ్యాలరీ

Baby Name

పుట్టిన శిశువుకి 21 రోజున పేరు పెట్టడంను  నామకరణం  . అదే రోజున ఊయలలో కూడా వేయడం జరుగుతుంది. దీనిని డోలారోహణం  అని అంటారు. ఇది లగ్నాదుల శుద్ధి ననుసరించి చేయవలయుదురు. జాతాశౌచము పూర్తియైన తరువాత పండ్రెండ్రవ రోజునగాని, పదహారవ రోజున గాని, యిరువది ఒకటవ  రోజునకాని, యిరువది ఐదవ  రోజున గాని లేదా 29 రోజున గానీ  నామకరణం చేయిస్తారు. పురుషులకు సరి సంఖ్య, స్త్రీలకు బేసి సంఖ్య గల యక్షరములతో నున్న నామములను నామకరణ మహోత్సవములో ఎక్కువగా వాడుతుంటరునామకరణంలో శిశువుకి వేదోక్తంగా మాసనామం, నక్షత్ర నామం, వ్యవహార నామంలను బియ్యంలో రాయిస్తారు. ఇలా ఆచరించడం వలన శిశువుకి దీర్ఘాయుష్యుడు అవుతాడు.

Click here to know more

A horoscope/janampatri is a basic tool for making astrological forecasts.
Click here to know more

శ్రీకృతం కి స్వాగతం
ఫాలో అవ్వండి

రచయిత గురించి
పేరు: మద్దికుంట శ్రీకాంత్ శర్మ.పుట్టింది తెలంగాణా లోని మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో,ఉస్మానియా యూనివర్సిటీ నుండి  బి కాం పూర్తి చేసినారు.వేద విద్యా గురువులు బ్రహ్మశ్రీ  మంచినీళ్ళ పాండురంగ శర్మ గారు ( ద్వి వేదులు . కొమురవెల్లి దేవస్థాన వేదపండితులు , ముఖ్యమంత్రి చే స్వర్ణ కంకణ సన్మానితులు ).జోతిష్య గురువులు బ్రహ్మశ్రీ మంచినీళ్ళ రఘురామ శర్మ గారు.శ్రీ శ్రీకాంత్ శర్మగారు సుమారు 20 సంవత్సరముల నుండి  వైదిక జోతిష్య రంగంలో రాణించి అనేక  టీవీ  చానళ్లలో తమ ప్రతిభను కనబరచినారు.
దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం  బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా  అంటుంది స్మృతి .మంత్రం లో ఆధీనం అయిన దైవం ప్రసన్నం కావాలి అంటే  మంత్రశుద్ధి కావాలి ...మంత్రశుద్ధి కావాలి అంటే  వాక్శుద్ధి ఉండాలి వాక్ శుద్ధి  కావాలి అంటే ...ఉపాసన బలం కావాలి . అలాంటి ఉపాసన బలం తోడైనప్పుడే మంత్రం కాని జోస్యం కాని ఫలిస్తుందని గ్రహించిన శ్రీకాంత్ శర్మ గారు నిత్యం సహస్ర గాయత్రి జపం ....మాస శివరాత్రి అభిషేకము , సంకట హర చతుర్థి వ్రతములు కటోర నిష్టతో  ఆచరిస్తారు.
ఎంతో మందికి సమస్యల నుండి ఉపశమనం కలిగించారు.అంతే కాకుండా '' హిందూ ధర్మచక్రం '' పేరిట  సోషల్ నెట్వర్క్ సహాయంతో  దేశ విదేశాల్లోని  ఎంతో మందికి అనేక ధార్మిక విషయాలు తెలియజేస్తూ  హిందూ మత పరి రక్షణకు కృషి చేస్తున్నారు.సకాలంలో వర్షాలు కురవాలని వరుణ యాగాములను నిర్వహించినారు.దేశ విదేశ పర్యటనలతో  అనెక దైవిక కార్యక్రమాలు చేపట్టారు
మీ శ్రీకాంత్ శర్మ
పేరు: మద్దికుంట శ్రీకాంత్ శర్మ.పుట్టింది తెలంగాణా లోని మెదక్ జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో,ఉస్మానియా యూనివర్సిటీ నుండి  బి కాం పూర్తి చేసినారు.వేద విద్యా గురువులు బ్రహ్మశ్రీ  మంచినీళ్ళ పాండురంగ శర్మ గారు ( ద్వి వేదులు . కొమురవెల్లి దేవస్థాన వేదపండితులు , ముఖ్యమంత్రి చే స్వర్ణ కంకణ సన్మానితులు ).జోతిష్య గురువులు బ్రహ్మశ్రీ మంచినీళ్ళ రఘురామ శర్మ గారు.శ్రీ శ్రీకాంత్ శర్మగారు సుమారు 20 సంవత్సరముల నుండి  వైదిక జోతిష్య రంగంలో రాణించి అనేక  టీవీ  చానళ్లలో తమ ప్రతిభను కనబరచినారు.
దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం  బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవతా  అంటుంది స్మృతి .మంత్రం లో ఆధీనం అయిన దైవం ప్రసన్నం కావాలి అంటే  మంత్రశుద్ధి కావాలి ...మంత్రశుద్ధి కావాలి అంటే  వాక్శుద్ధి ఉండాలి వాక్ శుద్ధి  కావాలి అంటే ...ఉపాసన బలం కావాలి . అలాంటి ఉపాసన బలం తోడైనప్పుడే మంత్రం కాని జోస్యం కాని ఫలిస్తుందని గ్రహించిన శ్రీకాంత్ శర్మ గారు నిత్యం సహస్ర గాయత్రి జపం ....మాస శివరాత్రి అభిషేకము , సంకట హర చతుర్థి వ్రతములు కటోర నిష్టతో  ఆచరిస్తారు.
ఎంతో మందికి సమస్యల నుండి ఉపశమనం కలిగించారు.అంతే కాకుండా '' హిందూ ధర్మచక్రం '' పేరిట  సోషల్ నెట్వర్క్ సహాయంతో  దేశ విదేశాల్లోని  ఎంతో మందికి అనేక ధార్మిక విషయాలు తెలియజేస్తూ  హిందూ మత పరి రక్షణకు కృషి చేస్తున్నారు.సకాలంలో వర్షాలు కురవాలని వరుణ యాగాములను నిర్వహించినారు.దేశ విదేశ పర్యటనలతో  అనెక దైవిక కార్యక్రమాలు చేపట్టారు
మీ శ్రీకాంత్ శర్మ
Read More
STAY IN TOUCH
Astrology
Aboutus
Privacy
FAQ
Termsofuse
Help&Support
For Help:
msksharma108@gmail.com
Call us: +91-8712940140